SERP ఉద్యోగ సంఘాల జేఏసీ కీలక తీర్మానం

0
88

హైదరాబాద్ ఓంకార్ బవన్ లో SERP ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఉద్యోగ సంఘాల జేఏసీ కీలక తీర్మానం తీసుకుంది. 2018 మేనిఫెస్టో హామీ ప్రకారం SERP సిబ్బందిని క్రమబద్దీకరణ చేయాలని రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వారి నుంచి మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు. అలాగే మంత్రులందరినీ అన్ని జిల్లాల్లో కలిసి విన్నవించాలని స్టేట్ మీటింగ్ తీర్మానించారు.

22 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కష్టాన్ని గుర్తించే 2018లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష హోదాలో మేనిఫెస్టోలో చేర్చారని తర్వాత గవర్నర్ ప్రసంగంలో కూడా వివరంగా పేర్కొన్నారనీ ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపట్టాలని సమావేశం కోరింది. SERP ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన “రెగ్యులరైజేషన్ సాధన సదస్సులో” కుంట గంగాధర్ రెడ్డి, ఏపూరి నరసయ్య సుభాష్ గౌడ్ సుదర్శన్ జానయ్య జిల్లా ఓబిలు, రాష్ట్ర నలుమూలల నుంచి SERP జిల్లా యూనియన్ నాయకులు పాల్గొన్నారు.