ఏపీలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది జగన్ సర్కారు, అంతేకాదు పేద మహిళల వివాహానికి అవసరం అయ్యే నగదు కోసం తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందలు పడతారు…అప్పులు చేస్తారు, అయితే ఏపీలో జగన్ సర్కారు నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము వారి పేరెంట్స్ కి భారం అవ్వకూడదు అని భావించింది.
దీంతో వైయస్సార్ పెళ్ళి కానుక పథకానికి శ్రీకారం చుట్టింది…వైఎస్సార్ పెళ్లి కానుక రూపకల్పన చేసింది. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు తెలుసుకోండి. ఇక కచ్చితంగా ఈ పథకానికి అప్లై చేసుకునే వారు ఏపీలో ఉండాలి, వధువు వరుడు కచ్చితంగా ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి.
సుమారు 50 వేల నుంచి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు అందిస్తారు, అయితే పెళ్లికి ముందు 20 శాతం నగదు ఇస్తారు, వివాహం తర్వాత 80 శాతం ఆమె అకౌంట్లో జమ చేస్తారు.