పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేది బిస్కెట్ అలాగే చాక్లెట్.. కొన్ని వేల పరిశ్రమలు ఉన్నాయి ప్రపంచంలో, మన దేశంలో దాదాపు వందల పరిశ్రమలు ఉన్నాయి, బిస్కెట్ల మార్కెట్ ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంటుంది, అయితే ఈ బిస్కెట్ల కంపెనీలో ఓ ఉద్యోగం గురించి ఓ వార్త వినిపిస్తోంది.
స్కాటిష్ చెందిన ఒక బిస్కెట్ తయారీ కంపెనీ మాస్టర్ బిస్కెట్స్ జాబ్ ఆఫర్ చేస్తోంది, మీరు చేయాల్సింది ఏమిటో కూడా ముందే చెబుతోంది, ఆసక్తి ఉన్న వారుపోస్టుకి అప్లై చేయవచ్చు, మాస్టర్ బిస్కెటర్ కోసం ఈ కంపెనీ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. బిస్కెట్లు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి.
దాని టేస్ట్ అలాగే ప్యాకేజ్ అమ్మకానికి సంబంధించి సలహాలు ఇవ్వాలి, మంచి మాట నైపుణ్యం కూడా ఉండాలి, ఇలాంటి వారికి ఉద్యోగం కల్పిస్తుంది…ఏకంగా సంవత్సరానికి 40 లక్షల రూపాయల ప్యాకేజీ అందించేందుకు సిద్ధమైంది. అంతేకాదు 35 రోజుల పాటు సెలవులు కూడా అందిస్తుంది. కేవలం ఆ దేశ పైరులకి మాత్రమే ఈ అవకాశం. ఉచితంగా వీక్లీ బిస్కెట్స్ కూడా ఇంటికి ఇస్తారు.