నిజమే లక్ ఉండాలే కాని వారు ఎక్కడ ఉన్నా వారికే చెందుతుంది అంటారు పెద్దలు..ఇప్పుడు అదే నిజం అయింది నలుగురి విషయంలో…ఫ్రాన్స్ లోని బ్రెస్ట్ నగరంలో నలుగురు బిచ్చగాళ్లు లాటరీ టికెట్లు అమ్మే దుకాణం దగ్గర రోజూ బిక్షాటన చేస్తున్నారు. అక్కడికి వచ్చేవాళ్లు బిచ్చమేసి పుణ్యం చేసుకుంటారు, అయితే ఇక్కడ ఓ యువతి లాటరీ టికెట్ కొనుగోలు చేసి బయటకు వచ్చింది.
ఆమెని బిక్షం అడిగారు నగదు లేదు అని చెప్పింది, ఇక తాను కొన్న లాటరీ టికెట్ వారికి దానంగా బిక్షం వేసి వెళ్లిపోయింది, దీంతో వారు నగదు ఇవ్వకుండా ఈ టికెట్ ఎందుకు అనుకున్నారు, కాని అది కాస్త చూస్తే వారికి లక్ష్మీ కటాక్షం వచ్చింది ఏకంగా 43 లక్షల వరకూ లాటరీ తగిలింది.
దీంతో ఆ లాటరీ కంపెనీ వారు ఆ టికెట్ ఎవరు తమకి ఇస్తే వారికి నగదు ఇస్తాం అని తెలిపారు, దీంతో ఆనలుగురు ఇప్పుడు తలో పది లక్షలు తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు. దీంతో ఆమెను వరించాల్సిన అదృష్టం బిచ్చగాళ్లకు దక్కింది.