చాలా మంది చదువుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇలాంటి వారి కోరిక నెరవేర్చడానికి చాలా మంది సాయం చేస్తూ ఉంటారు, అయితే ఇక్కడ ఓ వ్యక్తి తన మనవరాలి కోరిక తీర్చడం కోసం చేసిన పనికి అందరూ చెతులెత్తి దణ్నం పెడుతున్నారు..
తన మనవరాలి చదువు కోసం సొంత ఇంటిని అమ్మేసి ఆటోనే నివాసంగా మార్చుకున్నాడు ఒక ఆటో డ్రైవర్…
దేశ్రాజ్ ముంబైలో ఆటో డ్రైవర్.. ఆయనకు ఇద్దరు కొడుకులు కాని ఇద్దరు మరణించారు ఇక కోడలు భార్య
నలుగురు మనవరాళ్ల పోషణ ఆయనే చూసుకుంటున్నారు.
తన మనవరాలి చదువు కోసం ఇప్పటికే ఇంటిని అమ్మేశాడు. ఆమె టీచర్ కావాలి అని కోరికతో ఉంది.. అందుకోసం నగదు బయట కుదరక తన ఇంటినే అమ్ముకున్నాడు..పన్నెండవ తరగతి బోర్డు పరీక్షల్లో తన మనవరాలు 80 శాతం మార్కులు సాధించింది. ఆమె బీఈడీ చదవాలి అనే కోరికతో ఉంది.. దీంతో ఆమెని చదివించడానికి ముంబైలో ఉన్న తన సొంత ఇంటిని అమ్మేశాడు, ఇక ఇంటి సభ్యులని గ్రామంలోని ఓ ఇంటికి పంపించాడు.. ముంబైలో ఆటోనడుపుకుంటూ ఆటోలో పడుకుంటున్నాడు, అతని కష్టం చూసి అందరూ సోషల్ మీడియాలో పెడుతున్నారు.
Attachments area