యాంకర్ ని చెంప పై కొట్టిన మంత్రి

యాంకర్ ని చెంప పై కొట్టిన మంత్రి

0
110

టీ.వి డిబేట్లు సమావేశాలు జరిగే సమయంలో పార్టిసిపేట్ చేసేవారే కాదు, యాంకర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి, తాజాగా
పాకిస్థాన్ లో ఓ మంత్రి టీవీ యాంకర్ చెంప చెళ్లుమనిపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతకి సదరు యాంకర్ చేసిన తప్పు పై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. అసలు జరిగింది ఏమిటి అంటే.

ప్రముఖ టిక్ టాక్ నటి హరీమ్ షాతో తనకు సంబంధం అంటగట్టిన యాంకర్ ముబాషెహర్ పై పాక్ మంత్రి ఫవాద్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముబాషెహర్ ఓ టీవీ కార్యక్రమం చేస్తూ.. మరో యాంకర్ తో మాట్లాడుతూ.. టిక్ టాక్ స్టార్ హరీమ్ షాతో మంత్రి చౌదరి ఉన్న అసభ్య వీడియోలను చూశానన్నారు.. అయితే దీనిపై మంత్రి సీరియస్ అయ్యారు, సమయం కోసం చూశారు.

తాజాగా ఓ వివాహ వేడుకలో సదరు యాంకర్ వచ్చారు, అతనిని చూసిన వెంటనే చెంప పగులగొట్టారు ఈ మంత్రి.. ఈ విషయంపై మంత్రి చౌదరి ట్విట్టర్ లో స్పందించారు. పదవులు ఉండవచ్చు పోవచ్చు, కానీ మనము మనుషులం. మనపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు స్పందిస్తాం. వ్యక్తి గత ఆరోపణలు చేస్తే సహించేది లేదు అన్నారు, ఇలాంటి జర్నలిస్టులని వదలకూడదు అని అతను మంచి వ్యక్తి కాదు అని మంత్రి కామెంట్ చేశారు, దీనిపై సోషల్ మీడియాలో మంత్రికి సపోర్ట్ గా కామెంట్లు వస్తున్నాయి.