మరో రెండు పథకాలకు మోదీ సర్కార్ శ్రీకారం..వివరాలివే

The Modi government has agreed to two more schemes

0
81

మోదీ సర్కార్ మరో రెండు పథకాలకు నేడు శ్రీకారం చుట్టనుంది. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 , అమృత్ 2.0 పథకాలను న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.

ఈ రెండు పథకాలు కూడా నగరాలన్నింటినీ చెత్త రహితంగా..నీటి భద్రతగా మార్చాలనే ఆకాంక్షను నెరవేర్చేందుకు రూపొందించినట్లు పీఎంఓ కార్యాలయం వెల్లడించింది. ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో 10.5 కోట్ల మందికి పైగా ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. అమృత్ 2.0 పథకానికి దాదాపు 2.87 లక్షల కోట్ల నిధులను సమకూర్చనున్నారు.