ఆ ఇంట్లో కవలలు పుట్టారు ఎంతో సంతోషంలో ఉన్నారు అందరూ, ఈ ఆనందకర సమయంలోనే విషాదం జరిగింది.. ఎనిమిది రోజుల పసికందుని కోతులు తీసుకువెళ్లిపోయాయి, చివరకు కందకంలో పడేసి చంపేశాయి.అయితే వైద్యులు మాత్రం ఇలా ఆ కోతులు తీసుకువెళ్లవు అని అంటున్నారు… అయితే తల్లి మాత్రం కోతులు తీసుకువెళ్లాయి అని చెబుతుంది.
తమిళనాడులోని తంజావూరు కోటకు సమీపంలోని మేళాంగళంలో ఈ ఘటన జరిగింది.. ఆమె ఇంట్లో పిల్లలతో ఉన్న సమయంలో ఆ పెంకుటింటి పై కప్పు తీసి లోపలకి వచ్చాయి.. చాపపై పడుకోబెట్టిన ఇద్దరు పసిపిల్లలను ఎత్తుకెళ్లాయి.
ఇంటిపైన పాపను పట్టుకున్న కోతి కనిపించిందని తెలిపింది.
వెంటనే కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చారు అని… వెంటనే ఓ పాపను వదిలింది అని చెప్పారు, ఇక రెండో చిన్నారి కనిపించలేదు… దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు …చివరకు వెతకగా తంజావూరు కోట చుట్టూ తవ్విన కందకంలో పాప మృతదేహం కనిపించింది…. అయితే ఇలా కోతులు చేసే ప్రసక్తే ఉండదు అని ఫారెస్ట్ ఆఫీసర్స్ అంటున్నారు… దీనిపై తల్లిదండ్రులని కూడా విచారణ చేస్తున్నారు.
.