రైల్వేస్టేషన్లో కోతుల బెడద- వాటిని తరిమేందుకు అధికారులు ఏం చేశారంటే

-

కోతులు గుంపుగా ఉన్నాయి అంటే అక్కడ మాములు అల్లరి ఉండదు… వాటిని ఎవరైనా బెదిరించినా వాటిపై దాడిచేసినా అవి
కరిచేందుకు ముందుకు వస్తాయి… అందుకే కోతుల గుంపు ఉంది అంటే ఇక అక్కడ ఎవరూ ఉండరు.. అంత దారుణంగా ఉంటాయి అవి. కొండముచ్చు మాదిరిగా మనిషి అరిచే అరుపులకు కోతులు పారిపోతుంటాయి. ఇది మీకు తెలుసా నిజమే ఇలా చాలా మంది చేసి సక్సెస్  అయ్యారు, ఇలాంటి అరుపులు వినిపిస్తే అవి వెంటనే పారిపోతాయి.
యూపీలోని లక్నో పరిధిలోగల చార్బాగ్ రైల్వే స్టేషన్లో అధికారులు ఇలాగే చేశారు, ప్రయాణికుల భద్రత కోసం గత ఆరు నెలలుగా స్టేషన్లో కొండముచ్చు అరుపులను వినిపిస్తున్నారు. ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు, ఇక్కడ కోతుల బెడద మాములుగా లేదు, నిత్యం అవి దారుణంగా నానా బీభత్సం సృష్టిస్తుంటాయి.
ఇక ప్రయాణికుల బ్యాగులు ఫుడ్ ఇలా ఏది ఉన్నా తీసుకుంటున్నాయి, దీంతో రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఇలా కోతులను తరిమి కొట్టేందుకు కొండముచ్చులా అరిచే వ్యక్తిని స్టేషన్లో నియమించారు. ఇక అతను అరిస్తే వెంటనే అవి అక్కడ నుంచి పారిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanth Varma | అవకాశమిస్తే దర్శకత్వం మానేస్తా: ప్రశాంత్ వర్మ

తన తొలి డైరెక్టోరియల్ ‘హనుమాన్(Hanuman)’ సినిమాతో యావత్ దేశమంతటా తనకంటూ ప్రత్యేక...

RGV | ఏపీ హైకోర్టును మరోసారి ఆశ్రయించిన ఆర్‌జీవీ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) మరో పిటిషన్...