అమెజాన్ సీఈఓ అనగానే అపర కుబేరుడు జెఫ్ బెజోస్ అని చెబుతాం. అయితే ఇక ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ పదవి ఆయన శిష్యుడికి ఇచ్చారు. ఆండీ జాస్సీ నూతన సీఈవోగా బాధ్యతలు అందుకున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ ను 1994లో స్థాపించారు. ప్రపంచంలో టాప్ 10 కంపెనీల్లో అమెజాన్ ఒకటిగా నిలిచింది. ఈ కామర్స్ రంగంలో ప్రపంచంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
కంపెనీ 1.7 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ శక్తిగా మారింది. ఇక అమెజాన్ కేవలం ఈకామర్స్ రంగంలోనే కాదు ఓటీటీ అమెజాన్ ప్రైమ్, క్లౌడ్ కంప్యూటింగ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రంగాల్లోనూ దూసుకుపోతోంది. వీటి నిర్వహణ వెనుక కొత్త సీఈఓ ఆండీ జాస్సీ కృషి ఎంతో ఉంది.
కొన్ని సంవత్సరాల క్రితం ఈ వెబ్ సర్వీసెస్ రంగంలో ఆదాయాన్ని పసిగట్టిన జెఫ్ బెజోస్ ఏడబ్ల్యూఎస్ కు రూపకల్పన చేశారు. దాన్ని లాభాల బాట పట్టించింది ఆండీ జాస్సీ అని అంటారు. ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఆయన పట్టా అందుకున్నారు. కంపెనీ కొత్త ఆలోచనలతో మరింత ముందుకు సాగుతుందని బెజోస్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.