తొలిరోజు వరాల జల్లు కురిపించిన కర్ణాటక కొత్త సీఎం బొమ్మై

The new Karnataka Cm Bommai is announcements

0
92

ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే ఆనాయ‌కుడు ప్ర‌జ‌ల‌కు వ‌రాలు ఇవ్వ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. త‌మ మార్క్ చూపిస్తూ ఉంటారు సీఎంలు. ఇక తాజాగా క‌ర్ణాట‌క‌లో ముఖ్య‌మంత్రిగా
బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలను చేపట్టిన తొలిరోజే రాష్ట్ర ప్రజలపై ఆయన వరాలు కురిపించారు.

ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌తో అంద‌రూ చాలా సంతోషంగా ఉన్నారు.పింఛన్లను పెంచుతున్నట్టు ప్రకటించారు. వృద్ధాప్య పింఛన్ ను రూ. 1,000 నుంచి రూ. 1,200కు పెంచుతున్నట్టు తెలిపారు. వితంతువులు, దివ్యాంగుల పింఛన్లను రూ. 600 నుంచి రూ. 800కు పెంచుతున్నట్టు చెప్పారు. అంతేకాకుండా మ‌రో గుడ్ న్యూస్ కూడా చెప్పారు ఆయ‌న‌.

రైతు కుటుంబాల్లో పిల్లలకు రూ. 1,000 కోట్లతో స్కాలర్ షిప్ లను ఇవ్వనున్నట్టు తెలిపారు.
ఇటు దేశ వ్యాప్తంగా అంద‌రు ముఖ్య నేత‌లు క‌ర్ణాట‌క‌లో కొత్త ముఖ్య‌మంత్రి
బసవరాజ్ బొమ్మైకు అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నారు. బసవరాజ్ బొమ్మైకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు

https://twitter.com/narendramodi/status/1420265378500935684