ఫేస్ బుక్ ఈ ప్రపంచంలో ఎంతో మంది మిత్రులని కలిపింది, అంతేకాదు ఫేస్ బుక్ లేనిదే ఇక తమ డైలీ పని జరగదు అనేవారు చాలా మంది ఉన్నారు, తమ ప్రతీ స్టేటస్ ని ఫేస్ బుక్ లో షేర్ చేసుకునేవారు, అయితే కోట్లాది మంది యూజర్లు ఉన్నారు ఫేస్ బుక్ కి, అలాగే అనేక రకాల కొత్త ఫీచర్లను ఫేస్ బుక్ తీసుకువస్తోంది.
తాజాగా కొద్ది రోజులుగా ఫేస్ బుక్ లో న్యూ ఫేస్ బుక్ ఫీచర్ మెనూ లిస్టులో కనిపిస్తోంది, అది ఇష్టం లేని వారు క్లాసిక్ లుక్ వాడేవారు, కాని ఇప్పుడు మొత్తానికి పాత ఫీచర్ కు గుడ్ బై చెబుతోంది ఫేస్ బుక్.
ఫేస్ బుక్ పాత రూపుకు స్వస్తి పలుకుతోంది. సెప్టెంబరు నుంచి ఫేస్ బుక్ కొత్తగా కనిపించనుంది.
అనేక టెక్నికల్ అంశాలు పరిశీలించి ఇది తయారు చేశారు, చాలా మంది అభిప్రాయాలు కూడా తీసుకున్నారు, అయితే ఇక కొత్త రూపు సెప్టెంబర్ నుంచి యూజర్లకు పూర్తిగా అదే ఉంటుంది.
అంతేకాదు డార్క్ మోడ్ ఫీచర్ ను కూడా ఫేస్ బుక్ తన వినియోగదారులకు అందిస్తోంది.