నిజమే అక్క చెల్లి ఇంటిలో ఉంటే నాన్న తర్వాత అంత ప్రేమ ఆప్యాయత ఆ సోదరులు వారిపై చూపిస్తారు, సో ఇక్కడ అంతే వారిది పెద్ద కుటుంబం… అక్కకి మంచి సంబంధం వచ్చింది, పైగా ఆ పెళ్లి కొడుకు డాక్టర్, ఇంకేముంది కట్నం కూడా వద్దు అనడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అయితే సూరత్ లోని మెయిన్ స్ట్రీట్ లో పెళ్లి కూతురు తండ్రికి 650 గజాల సైట్ ఉంది. ఈ సైట్ మాత్రం మీ అమ్మాయి పేరున రాసి ఇవ్వాలి అని కండిషన్ పెట్టాడు వరుడి తండ్రి.
ఎందుకు అంటే ఆ సైట్లో పెళ్లి కొడుక్కి ఓ హాస్పిటల్ కట్టాలి అని కోరిక.. దీంతో మంచి సంబంధం కావడంతో అమ్మాయి తండ్రి ఆలోచించి చెబుతా అన్నాడు, ఎందుకు అంటే అదే సైట్లో తన కొడుకు చేత హస్పిటల్ కట్టించాలి అని భావించాడు అతని తండ్రి పేరుమీద, అమ్మాయి తమ్ముడు కూడా డాక్టర్ గా పని చేస్తున్నాడు.. కాని ఇప్పుడు అల్లుడికి కట్నంగా అది ఇస్తే ఎలా అని ఆలోచించాడు.
అయితే కుటుంబం మంచిది కావడంతో అక్క సంతోషం కోసం ఆ తమ్ముడు ఆమె పేరు మీద ఆ సైట్ రాసి ఇవ్వమని చెప్పాడు, మొత్తానికి ఇటీవల అంగరంగ వైభవంగా ఈ వివాహం జరిగింది, అయితే వారి కోరిక విన్న పెళ్లికొడుకు తండ్రి వారిని బాధపెట్టడం ఇష్టం లేక.. మహంతీ ఆదర్శ్ అనే పేరుతో హస్పిటల్ నిర్మిస్తామని చెప్పారు.. ఇది వియ్యంకుల ఇద్దరి తండ్రుల పేరుతో కలిసి వచ్చేలా పెట్టనున్నారట.