ప్రజల నిరసనలు ఉధృతం..పారిపోయిన లంక అధ్యక్షుడు?

0
100
Srilanka

శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొనడానికి రాజపక్సేల కుటుంబమే కారణమంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఆందోళనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇవాళ ఉదయం కర్ఫ్యూ ఎత్తివేయడంతో మళ్లీ ప్రజలు నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ క్రమంలో కొలంబోలోని అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటి వైపు ఆందోళనకారులు దూసుకెళ్లారు. విషయం తెలుసుకున్న గొటబాయ అధికార నివాసం నుంచి పారిపోయినట్టు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు.