డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో వాహనాలు జప్తుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో హైకోర్టు ఎమ్మన్నదంటే..డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వాహనాలు జప్తు చేసే అధికారం పోలీసులకు లేదు. మద్యం తాగిన వ్యక్తి వెంట ఉంటే వాహనం అప్పగించాలి లేదా , బంధువులను పిలిచి వాహనం అప్పగించాలి. ఒకవేళ ఎవరు రాకపోతే పిఎస్ కు తరలించి తర్వాత అప్పగించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ఈ ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు కూడా తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.