భర్తతో కలిసి ఆమె ఎత్తైన కొండపైకి వెళ్లింది.. ఈ సమయంలో అతను ఆమె ఇద్దరూ కలిసి ఫోటోలు తీసుకున్నారు, ఈ లోపు ఆమె సెల్పీలు తీసుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆమె ఎక్కడ ఉంది అని చూసేసరికి ఆమె వెనుక కనిపించలేదు.. చూస్తే ఆమె ఆ ఎత్తైన కొండ నుంచి కింద పడిపోయింది.. ఆమె చనిపోవడంతో అతను బాధపడ్డాడు.. తర్వాత కొన్నాళ్లకు ఆమె పేరుమీద ఉన్న ఇన్సూరెన్స్ కోసం అప్లై చేశాడు.
ఈ సమయంలో మన కరెన్సీలో 40 లక్షల నగదు అతనికి రావాలి… అయితే దీనిపై వారికి అనుమానం వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేశారు… వెంటనే వారు దీనిపై విచారణ చేస్తే అతనే ఆమెని తోశాడు అని అంటున్నారు… కాని తాను ఆమెని తోయలేదని ఆమె ప్రమాదవశాత్తు పడిపోయింది అని చెబుతున్నాడు.
2018 లోటర్కీలో చోటు చేసుకుందీ ఈ ఘటన… ఆమె నిండు గర్భిణీ అయితే ఇద్దరూ ఉన్న చోట మరో వ్యక్తి లేడు… ఇక ఆమె బ్యాగులో ఏదో వెతుకుతున్న సమయంలో ఆమె సెల్ఫీ తీసుకుంటూ ఉంది.. ఈ సమయంలో ఒక్కసారిగా ఆమె కిందపడిపోయింది అని భర్త చెబుతున్నాడు, దీనిపై విచారణ చేస్తున్నారు పోలీసులు.