పోలీసులు కొన్ని కేసుల విచారణలో వారు శోధించిన అంశాలు చెబుతూ ఉంటారు, అలాంటి వాటిలో కొందరు దొంగల ముఠా ఏదైనా దొంగతనానికి వెళితే అక్కడ పూజలు చేయడం, కొబ్బరికాయ కొట్టడం, అలాగే అక్కడ వారి ఇంట్లో భోజనం చేయడం దేవుడికి మొక్కి ముందుకు వెల్లడం ఇలాంటివి చేస్తూ ఉంటారు, ఇలా కొన్ని ముఠాలు ఈ దొంగతనాలకి అవి సిగ్నేచర్ గా మార్చుకున్నారు.
అలా విచారణ చేసి కొన్ని ముఠాలని కూడా పట్టుకున్నారు, అయితే తాజాగా ఇలాంటి అంశం ఒకటి చర్చకు వస్తోంది.
చెన్నైలో ఓ దొంగ కూడా అలాంటివాడే. దేవాలయంలో చోరీకి వచ్చి హుండీలో డబ్బులు వేసి, తిరిగి అదే హుండీని దోచుకున్నాడు. తమిళనాడులోని తిరువనమియూర్ ప్రాంతంలోని మరుండేశ్వర్ ఆలయంలో ఇటీవల దోపిడీ జరిగింది. ఆలయం తెరిచిన పూజారులు హుండీ బద్దలై ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు పోలీసులు, అందులో సీసీటీవీ దృశ్యాలు చూసి పోలీసులు షాక్ అయ్యారు..
అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగ నేరుగా వెళ్లి దేవతా విగ్రహాల ముందు నిల్చుని భక్తితో ప్రార్థనలు చేయడం, హుండీలో డబ్బులు కూడా వేయడం సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది. తర్వాత గట్టి బలమైన రాడ్ తో హూండి కొట్టేసి డబ్బు తీసుకుని పారిపోయాడు, ఆ దొంగ మాస్క్ ధరించాడు, అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.