రమేష్ అనే వ్యక్తి ప్లాస్టిక్ కంపెనీలో పనిచేసేవాడు, అయితే అతని భార్య అతను కలిసి రోజంగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు, ఇక్కడ బట్టల దుకాణం నడుపుతున్న నజీబ్ అనే యువకుడు రమేష్ భార్య భాగమతితో పరిచయం పెట్టుకున్నాడు.. ఇక ఆమె అందానికి ముగ్దుడు అయ్యాడు భర్త తెచ్చే పదివేల జీతం ఎందుకు, నాతో ఉంటే ఇరవై వేలు నీకు ఇస్తా అన్నాడు.. ముందు నో చెప్పినా డబ్బుపై ఆశతో ఆమె ఆ దుకాణం నడిపే నజీబ్ కు దగ్గర అయింది.
భర్త ఇలా డ్యూటికి వెళ్లగానే ఇంటికి వచ్చేవాడు నజీబ్ ..ఆమెతో ఇక్కడ బెడ్ రూమ్ లో డ్యూటీ చేసేవాడు..
ఇక భర్తకి ఎలాంటి అనుమానం రాకుండా కొంత కాలం ఉన్నారు.. కాని ఇరుగుపొరుగు వారు భర్తకు భార్య గురించి చెప్పారు.. పద్దతి మార్చుకోమని చెప్పినా ఆమె వినలేదు… ఇక భర్త తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడు అని భావించి ప్రియుడితో స్కెచ్ వేసి భర్తని చంపాలి అని అనుకుంది ఆ భార్య.
రాత్రి భర్త పడుకున్న సమయంలో ప్రియుడికి కబురు పంపింది.. అయితే రాత్రి తాగిన పాలలో నిద్రమత్తు మాత్రలు వేసింది భర్తకు… దీంతో ఆ నిద్రలో ఉండగానే ప్రియుడి సాయంతో దిండు పెట్టి ముఖంపై నొక్కి చంపేశారు, పోలీసులు బంధువుల ముందు గుండెనొప్పి అని నాటకం ఆడింది.. కాని ఇరుగుపొరుగు వారు ఆమెపై అనుమానంతో అసలు సీన్ పోలీసులకు చెబితే , వారి స్టైల్లో ఆరాతీశారు అసలు నిజం ఒప్పుకుంది.