కొత్త ఏడాదిలో చాలా మంది కొత్త వస్తువులు కొనాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు, అయితే వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకు అంటే కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ ధరలు పెరుగుతున్నాయి.. ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ధరలు పెరగబోతున్నాయి. దాదాపు 10 శాతం వరకూ ధరలు పెరుగుతున్నాయి, ఇప్పటికే పలు కంపెనీలు కొన్ని వస్తువుల ధరలు పెంచాయి.
ఇలా ఎందుకు ధర పెరుగుతుంది అంటే ఈ వస్తువుల తయారీలో వినియోగించే కాపర్, అల్యూమినియం, స్టీల్, ప్లాస్టిక్ వంటి ధరలు భారీగా పెరిగాయి.. ముడి సరుకు దాదాపు 12 శాతం పెరిగింది.. ఇదంతా తయారీలో భారీగా ఖర్చు పెరిగేలా చేసింది. దీంతో ప్రొడక్ట్స్ రేట్ పెంచాల్సి వస్తోంది అంటున్నారు.
అంతేకాదు సముద్ర రవాణా, విమానాల కార్గో సేవల ధరల పెరుగుదల కూడా దీనికి కారణం. ఇక కొన్ని దేశాల నుంచి వచ్చే సప్లై గూడ్స్ తగ్గిపోయాయి.. ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.. టీవీ ప్యానెల్ ధరలు ఇప్పటికే పెరిగాయి.. ఇక ప్లాస్టిక్ ధరలు కూడా వెయ్యి కి 80 రూపాయల వరకూ పెరుగుదల కనిపిస్తున్నాయి.