కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన ప్రధాని..కుటుంబ పార్టీలను తరిమికొట్టాలంటూ..!

0
105

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 26వ తారీకు అనగా ఈరోజు హైదరాబాద్ లో పర్యటిస్తున్న క్రమంలో సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అతనిని తీవ్రంగా విమర్శిస్తూ తిట్ల పురాణాన్ని ఆశ్రయించాడు. తెలంగాణను టెక్నాలజీ హబ్ చేయాలని చూస్తుంటే..కుటుంబ పాలనలో బందీ చేయాలని చూస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డాడు. ఢిల్లీ నుంచి బేగంపేటకు 1 .45 చేరుకొని బీజేపీ నేతలతో మీటింగ్ నిర్వహించి వివిధ అంశాలపై చర్చిస్తూ స్వాగత సభలో మాట్లాడారు. కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుందని టీఆర్ఎస్‌కు పరోక్షంగా కేసీఆర్‌  చురకలంటించారు.

తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. తాను ఎప్పుడు వచ్చినా తెలంగాణ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారన్నారు. పట్టుదల, పౌరుషానికి తెలంగాణ మారు పేరని చెప్పుకొచ్చారు. ‘తెలంగాణ ప్రజల అభిమానమే నా బలం. యువతతో కలసి తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం.. ఇంత దూరం ఎండలో తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలకు ధన్యవాదాలు..’ అని తెలిపారు. ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదన్నారు. తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చూసే వారు అప్పుడు.. ఇప్పుడు ఉన్నారని చెప్పుకొచ్చారు. కుటుంబ పార్టీలు అధికారంలో ఉంటే అవినీతి పెచ్చురిల్లుతుందన్నారు.

పేదల సమస్యలు వారికి పట్టవన్నారు. ఒక్క కుటుంబమే తెలంగాణ అభివృద్ధిని నాశనం చేస్తోందన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు తన నివాళులని చెప్పారు. ఉద్యమంలో వేలాది మంది మరణించారని.. అమరుల ఆశయాలు నెరవేరడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలు కలలు సాకారం కావడం లేదని అన్నారు. మోదీ వస్తుంటే కేసీఆర్ పారిపోతుండు.. బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఊరుకునేది లేదు: సంజయ్ వార్నింగ్

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారం మార్పు తథ్యమని అన్నారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించాలన్నారు.తమ పోరాటం త్వరలోనే ఫలితాన్ని ఇవ్వబోతుందని పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని చెప్పారు. ప్రసంగం ముగిసిన అనంతరం ఇండియన్ బిజినెస్ స్కూల్  వార్షికోత్సవానికి మోదీ బయలుదేరి వెళ్లారు.