దానికి కారణం కేసీఆరే: బోరెడ్డి అయోధ్య రెడ్డి

The reason for that is KCR: Boreddy Ayodhya Reddy

0
101

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ మీడియా కో ఆర్డినేటర్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధిగా బోరెడ్డి అయోధ్య రెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఇంత ఎక్కువ ఛార్జీలు ఎప్పుడు పెంచలేదు.

పేద, మద్య తరగతి కుటుంబాలపై ఎక్కువ కరెంటు భారం ఛార్జీలు పెంపుతో 7 వేల కోట్ల భారం పేద, దిగువ మధ్యతరగతి ప్రజల మీద మోపుతోంది. కస్టమర్ చార్జీల పేరుతో దొంగ చాటు భారం మోపుతోంది. తక్కువ విద్యుత్ వాడే వారిపై ఎక్కువ భారం మోపే పనిలో పడింది ప్రభుత్వం. ఏడెళ్ళలో 40 వేల కోట్ల అప్పులు విద్యుత్ సంస్థలపై పడింది. ఎక్కడ లేని ఎక్కువ ధరలకు విద్యుత్ ఎక్కువ మొత్తం తో కొని అప్పుల పాలు చేసింది. కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఎక్కువ ధరలకు కొని నష్టాలకు కేసీఆర్ కారణం అని అన్నారు.

విద్యుత్ సంస్థల అప్పులు తీర్చుకోవడం కోసం పేదల మీద భారం మోపుతోంది. ప్రజలను చైతన్య పరుస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలకు కేసీఆర్, ఆయన అల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గంలోనే ఎక్కువ నష్టాలు ఎందుకు వచ్చినయి. కెసిఆర్ కుటుంబ సభ్యుల అవినీతి వల్ల సంస్థలు నష్టం. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఉచిత సరఫరా కోసం కాంగ్రెస్ పార్టీ, వైఎస్ గరిష్ట పరిమితి 4 మోటార్లు ఉంటే..కేసీఆర్ తన ఫార్మ్ హౌస్ లో లెక్కలేనన్ని కనెక్షన్లు వాడుకోవచ్చు అని పరిమితిని ఎత్తేశారు. దోపిడీ వాళ్ళది. భారం ప్రజల మీదనా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలకు, చార్జీలు పెంచడానికి కారణాల మీద శ్వేత పత్రం విడుదల చేయాలి. చార్జీలను పెంచడం సరైన నిర్ణయం కాదని, రెగ్యులేటరీ కమిషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ వాదనలను ప్రజల పక్షాన వినిపిస్తుంది. చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పోరాడుతుంది. నాలుగు విద్యుత్ కనెక్షన్ లు ఉంటే రైతులు ఉచిత కరెంట్ నిబంధన ఉంది. ఆ పరిమితి కెసిఆర్ ఎత్తేశారు. అయన వ్యవసాయ క్షేత్రంలో లెక్కకు మించి కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి నిబందలను మార్చారు. విద్యుత్ నష్టంలో కూడా మామ కేసీఆర్, అల్లుడి హరీష్ నియోజకవర్గంలో ఎక్కువ పాత్ర పోషించారని ఎద్దేవా చేశారు.