బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం …కొత్త ప్రాంతాలకు వెళ్లినా అక్కడ స్పెషల్ బిర్యానీ తినడానికి ఆసక్తి చూపిస్తారు, ఇక అనేక రకాల ప్లేవర్ బిర్యానీలు ఇప్పుడు ఉంటున్నాయి, ఇక హైదరాబాద్ వస్తే కచ్చితంగా బిర్యానీ తిని వెళతారు ఎవరైనా.. పల్లెల నుంచి ఎవరైనా సిటీకి వచ్చినా అక్కడ బిర్యానీ రుచి చూడందే బస్సు ట్రైన్ ఎక్కరు.. చాలా మంది ఇలా బిర్యానీని ఇష్టంగా తింటారు.
కాని దురదృష్టం ఏమిటి అంటే ఓ మహిళ బిర్యాని తింటూ కళ్లు తిరిగి పడిపోయింది. చివరికి ఆమె బిర్యాని తింటూనే చనిపోయింది. మహాబూబ్ నగర్ కు చెందిన ఓ మహిళ ఇటీవల నగరానికి వచ్చింది,
వారం రోజుల క్రితం చనిపోయిన వారి ఇంటికి పరామర్శకు వచ్చింది, ఆ తర్వాత అక్కడ నుంచి సొంత ఊరికి వెళుతోంది.
ఈ సమయంలో బస్సు ఎక్కడానికి కూర్చుంది, అయితే బాక్స్ లో తెచ్చుకున్న బిర్యాని నీ తినడం మొదలు పెట్టింది. అలా తింటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.. వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లారు కాని ఆమె మరణించింది.. ఆమె ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. అయితే ఆమెకి అనారోగ్య సమస్యలు ఉండి ఉంటాయి అని భావిస్తున్నారు.