‘అగ్నిపథ్‌’కు దరఖాస్తుల రికార్డ్..వాయుసేన చరిత్రలో తొలిసారి ఇలా..

0
103
FSL Report agnipath

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకం అల్లర్లకు దారి తీసిన విషయం తెలిసిందే. అగ్నిపథ్ పథకం భారత ప్రభుత్వం మూడు సాయుధ దళాలలో ప్రవేశపెట్టిన నియామక వ్యవస్థ. ఈ విధానంలో నియమితులైన సిబ్బందిని అగ్నివీర్లు అంటారు. 2022 జూన్‌ 14న భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ పథకాన్ని 2022 సెప్టెంబరు నుండి అమలు చేయాలని తలపెట్టారు.

సైనిక బలగాల్లోకి నియమాకాలు జరిపే ఏకైక పద్ధతి ఇదే. నియమితుల ఉద్యోగ కాలం 4 సంవత్సరాలు. ఈ పథకం ద్వారా నియమితులైనవారిని అగ్నివీరులు అంటారు. ఈ పథకం ద్వారా గతంలో ఉన్నట్లుగా దీర్ఘ కాలం పాటు పని చేసే పద్ధతి పోతుంది. ఉద్యోగం నుండి విరమించాక ఫించన్ రాదు. ప్రతిపక్షాలు ఈ పథకాన్ని విమర్శిస్తూ దానిలోని లోపాలను ఎత్తిచూపాయి. పార్లమెంటులో చర్చించేవరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరాయి.

తాజాగా భారత వాయుసేనలో నియామకాల కోసం జూన్‌ 24న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలుకాగా.. 7.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. భారత వాయుసేన చరిత్రలో ఇంత అత్యధిక స్థాయిలో దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని చెప్పారు. భారత వాయుసేన అగ్నిపథ్‌ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుల ప్రక్రియ జూన్‌ 24న ప్రారంభం కాగా.. జులై 5తో ముగిసింది. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను ఈ ఏడాది డిసెంబరు 11న ప్రకటించనున్నారు.