మన దేశంలోనే అతిపెద్ద ఎడారి అంటే థార్ ఎడారి…చాలా మందికి ఈ విషయం తెలుసు.. ఎటు చూసినా ఇసుక మేటలు మన చెమట చుక్క మినహ మంచినీరు చుక్క కూడా కనిపించదు, అంత వెచ్చని వాతావరణం వేల కిలోమీటర్ల ఇసుక మేటలు ఉంటాయి థార్ ఎడారిలో.
అతిపెద్ద ఎడారి అయిన థార్లో పూర్వం నది ప్రవహించేదని ఓ పరిశోధనలో తేలింది. 1,70,000 సంవత్సరాల కిందట రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతానికి సమీపంలో ప్రవహించిన నది అప్పట్లో మనుషులకు జీవనాడిగా ఉండేదని తాజాగా పరిశోధనలో బయటపడింది.
థార్ ఎడారి మధ్యప్రాంతంలోని నాల్ క్వారీ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఖనిజాలపై అధ్యయనం చేసిన పరిశోధకులు నది అవశేషాలను కనుగొన్నారు. ఇక్కడ రాతియుగం నాటి మనుషులు జీవించారు అని తెలుసుకున్నారు, ఈ పరిశోధనలో అనేక విషయాలు బయటపడ్డాయి. ఈ ఎడారి అంతర పొరలోని నిక్షేపాల కింద నది ప్రవహించిన ఆధారాలను సేకరించినట్లు గుర్తించారు.