కొడుకు కేంద్రమంత్రి – కాని తల్లిదండ్రులు ఇప్పటికి కూలీపనికి వెళుతున్నారు

The son is a Union Minister - but the parents are still going to labour work

0
91

కేంద్ర కేబినెట్ ను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విస్తరించిన విషయం తెలిసిందే. కొందరు కొత్తగా కేంద్ర మంత్రులు అయ్యారు. అందులో తమిళనాడు బీజేపీ చీఫ్ ఎల్. మురుగన్ కు కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కింది. మురుగన్ కు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి పదవి ఇచ్చారు. తమిళనాడులో పార్టీ తరపున ఆయన ఎంతో గుర్తింపు పొందారు.

అయితే ఆయన గురించి, ఆయన తల్లిదండ్రుల గురించి ఓ వార్త ఇప్పుడు దేశంలో హైలెట్ అయింది. కొడుకు కేంద్ర మంత్రి అయినా ఆ తల్లిదండ్రులు మాత్రం కూలీలుగా బతుకుతున్నారు. తమకు ఇదే ఇష్టం అని చెబుతున్నారు. మా కుమారుడు మా సాయం లేకుండా స్వశక్తితో రాజకీయాల్లో ఎదిగాడు. మాకు సంతోషం అని చెబుతున్నారు ఆయన తల్లిదండ్రులు.

మురుగన్ స్వస్థలం తమిళనాడులోని నమ్మకల్ జిల్లా కోనూర్ గ్రామం. తల్లిదండ్రులు వరుదమ్మాళ్ , లోగనాథన్ అక్కడ రైతుల దగ్గర పొలాల్లో ఇప్పటికి వీరిద్దరూ కూలిపనికి వెళుతున్నారు. చిన్న రేకుల ఇంట్లో ఉంటున్నారు. పాత సైకిల్ మాత్రమే ఆయనకు ఉంది. పక్కవారు చెబితే తమ కుమారుడు కేంద్రమంత్రి అయ్యాడు అని తెలుసుకున్నారట.

తాము ఇప్పటికీ స్వతంత్రంగా జీవించేందుకే ఇష్టపడతామని స్పష్టం చేశారు.మురుగన్ న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. అయితే కుమారుడ్ని చూసేందుకు అప్పుడప్పుడూ నగరానికి వచ్చి నాలుగు రోజులు ఉండి వెళతారు. ఆ పల్లె వాతావరణం మాకు ఇష్టం అని చెబుతారు ఆ తల్లిదండ్రులు.ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి.