కొందరికి కొన్ని విచిత్రమైన పరిస్దితులు ఎదురు అవుతూ ఉంటాయి, ఇది కూడా అలాంటిది అని చెప్పాలి. ఓ 24 ఏళ్ల వ్యక్తి ఏ అమ్మాయిని ప్రేమించాలి అన్నా భయపడుతున్నాడు, అయితే పేరెంట్స్ ఏమీ అనకపోయినా అతని తండ్రి చేసిన పనికి అతను ఏ అమ్మాయిని ప్రేమించలేకపోతున్నాడు.
అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలోజేవ్ ఫోర్స్ అనే యువకుడికి 24 ఏళ్ల వయసు. తన ఫ్రెండ్స్ అందరూ డేటింగ్ లో ఉంటే తను మాత్రం సింగిల్ గా ఉండిపోయాడు, ఎందుకు అంటే జేవ్ తండ్రి యుక్తవయసులో ఉన్నప్పుడు ఏకంగా 500 సార్లు వీర్యదానం చేశాడట. దీంతో తాను ఎవరితో అయినా డేటింగ్ లో ఉంటే వారు తనకు చెల్లి అవుతారు అనే భయంతో డేటింగ్ కు దూరంగా ఉన్నాడట.
తన సోదర సోదరీమణులను కనిపెట్టేందుకు జేవ్ ప్రయత్నిస్తున్నాడు, తనతో చుదువుకున్న ఓ యువతిని కనిపెట్టాడు, తను నివాసం ఉంటున్న చోట మరో ఎనిమిది మందిని కనిపెట్టాడు, దీని కోసం వారికి డీఎన్ ఏ టెస్ట్ చేస్తున్నాడట. తనకు ఎవరైనా బాగా నచ్చితే ఆమెకి నేను నచ్చితే ముందు టెస్ట్ చేయిస్తా అంటున్నాడు ఈ యువకుడు.