అమ్మ ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు.. నవమాసాలు మోసి కని పెంచుతుంది తల్లి, తనకు తిండి లేకపోయినా తన బిడ్డల కడుపు నింపాలి అని కోరుకుంటుంది, అయితే ఎవరైనా తల్లిని దేవుడితో సమానంగా చూసుకోవాలి.. కాని ఇక్కడ ఓ కుమారుడు తల్లిపై గొడవపడి ఆమెని చెంపపై కొట్టాడు , ఆమె అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో చోటు చేసుకుంది. సీసీటీవీ కెమెరాలో రికార్డయింది ఇది. అవతార్ కౌర్అనే వృద్ధురాలు తమ ఇంటి వద్ద పొరుగింటి వారి వాహనాల పార్కింగ్ విషయంలో తన కొడుకు, కోడలితో మాట్లాడుతోంది. ఈ సమయంలో వారి మధ్య వివాదం జరిగింది.
రోజు ఈ పార్కింగ్ గురించి తల్లి వల్ల గొడవలు అవుతున్నాయి అని ఆమె కొడుకు ఆమెని చెంప పై కొట్టాడు, దీంతో ఆమె కింద పడిపోయింది. ఆమెని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.. కాని ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది… ఇక కుమారుడిపై పలు సెక్షన్లతో కేసులు ఫైల్ చేశారు పోలీసులు… మొత్తానికి అతను చేసిన పనికి అందరూ తిడుతున్నారు… అతనికి కఠిన శిక్ష వేయాలి అంటున్నారు
ఈ వీడియో చూడండి