మిరాయి పూరా లో నివాసం ఉంటున్నాడు సందీప్.. అయితే అతని ఇంట్లో అమ్మ నాన్నతో పాటు అతని చెల్లి ఉంటోంది. ఈ సమయంలో చెల్లికి డిసెంబరులో వివాహం చేశారు ..ఇక సందీప్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.. తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు.. అంతాబాగానే ఉంది అయితే తండ్రి కి సరోజ అనే చెల్లెలు ఉంది.. ఆమె భర్త వివాహం అయిన మూడో రోజు కరెంట్ షాక్ తో చనిపోయాడు. దీంతో ఆమె కూడా ఇంటి దగ్గర్లో నివాసం ఉంటోంది.
చూడటానికి చాలా అందగత్తె అంతేకాదు సందీప్ కంటే కేవలం 11 నెలలు పెద్దది, అయితే తన తండ్రికి ఓరోజు ఈ విషయం చెప్పాడు.. సమాజంలో అత్త అలా ఒంటరిగా ఉండిపోతోంది నేను ఆమెకి లైఫ్ ఇస్తాను.. నేను ఆమెని వివాహం చేసుకుంటాను అని చెప్పాడు.
అయితే తండ్రి ముందు వద్దు అన్నాడు, కాని సొంత చెల్లి జీవితం గురించి ఆలోచించి ఆమె ఒంటరి అవుతుంది అని చివరకు ఒప్పుకున్నాడు.. అయితే సందీప్ ఆలోచనకి ఊరంతా మెచ్చుకున్నారు.. ఇటీవల సందీప్ ఆమెని వివాహం చేసుకున్నాడు,
అతని మంచితనానికి స్ధానిక నేతలు కూడా వారికి ఆశీర్వచనాలు అందించారు.