Flash News: సమ్మె తాత్కాలికంగా వాయిదా

0
90

నేడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి విఆర్ఏలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వారు అనుకున్న విధంగానే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ హైదరాబాద్ కు వచ్చారు. పే స్కెల్ అమలు చేయాలి, we want justice అంటూ విఆర్ఏ లు తమ నిరసన గళం వినిపించారు. విఆర్ఏల నిరసనపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ చర్చలకు ఆహ్వానించారు. అసెంబ్లీ కమిటీ హాల్ లోనే విఆర్ఏల ప్రతినిధులతో కేటీఆర్ సంప్రదింపులు జరిపారు.

విఆర్ఏ ల సమస్యలపై, డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కేటీఆర్. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీఆర్ఏలు ఆందోళన విరమించాలని మంత్రి కేటీఆర్ కోరారు. అలాగే చర్చల తేదిపైన క్లారిటీ ఇచ్చారు.

జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు సెప్టెంబర్ 17న ముగియనున్నాయి. దీనితో సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీఆర్ఏ ల ప్రతినిధులతో చర్చిస్తారని స్పష్టం చేశారు. కేటీఆర్ స్పందించి తమ వాదనలు వినడంపై వీఆర్ఏ ల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.