ఆఫ్ఘనిస్థాన్ గురించి ప్రపంచం అంతా చర్చించుకుంటోంది. 20 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఆ దేశంలో మళ్లీ అలజడి రేగింది. తాలిబన్లు దేశంలో రెచ్చిపోవడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. మహిళలు తాలిబన్ల రాజ్యం ఎలా ఉంటుందో ఊహించుకుని బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే గతంలో వీరి పాలనలో మహిళలకు వీరు విధించిన కఠిన నియమాలు చట్టాలు అలాంటివి. చాలా దారుణమైన రూల్స్ విధించారు .
1. ఇంట్లోనుంచి మహిళలు భర్త లేదా తండ్రి లేదా అన్న తమ్ముడు ఆఖరికి కొడుకు అయినా ఎవరో ఒకరు తోడుగా ఉండి బయటకు వెళ్లాలి
2. మహిళలు కచ్చితంగా బుర్కా ధరించాలి.
3. మహిళలు హైహిల్స్ వేసుకోకూడదు.
4. కొత్త వారు ఇంటికి వచ్చినా పలకరింపు ఉండకూడదు ముఖం చూపించకూడదు.
5.ఇంట్లో కిటికీల నుంచి చూడటం బయటకు తిరగడం మేడలు మిద్దెలపై నిలబడటం చేయకూడదు.
6.మహిళలు ఫోటోలు తీసుకోకూడదు.
7. ఇంటికి వారి పేర్లు పెట్టకూడదు
8. ఏ పండుగ అయినా రోడ్లమీదకి రాకూడదు
9. గోర్లకు పెయింట్ నెయిల్ పాలిష్ వేసుకోకూడదు తలకి రంగులు సౌందర్య సాధనాలు వాడకూడదు
10. ఫోన్లు వాడకూడదు
11. భర్తలు సోదరులువారి ఫోటోలు తీయకూడదు
12. కురచు దుస్తులు వేసుకుంటే ఉరి తీస్తారు లేదా జీవితకాలం జైలులో ఉంచుతారు
13. పేరెంట్స్ చూసిన వరుడ్ని కాకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకుంటానంటే చెవులు ముక్కు కోస్తారు.