ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే వారి అరాచకాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ముఖ్యంగా యువత చాలా మంది స్త్రీలు ఆ దేశం విడిచివెళ్లిపోవడానికి చూస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ కొలువులు చేసిన వారు కూడా రేపటి నుంచి పరిస్దితి ఏమిటా అని ఆలోచిస్తున్నారు. ఇక చాలా మంది మహిళలు తమ పిల్లలను అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తీసుకువెళుతున్నారు. ఇక అమ్మాయిలని ఆట బొమ్మల్లా మారుస్తారు. ఇంటి నుంచి బయటకు రానివ్వరు అనే భయం వారిలో కలుగుతోంది.
ఇక చదువులు ఉండవు ఉద్యోగాలు ఉండవు ఇలా అన్నింటికి ఆంక్షలు ఉంటాయి. 20 ఏళ్లుగా ఎంతో సంతోషంగా ఉన్న అమ్మాయిలు మళ్లీ ఆ చీకటి రోజులు వస్తాయా అని భయపడిపోతున్నారు. ఇక ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెబుతూనే తాలిబన్లు తమ చర్యలను ప్రారంభించారు. గత ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, అమెరికా సైన్యానికి సహకరించిన వారి వివరాలను తాలిబన్లు సేకరిస్తున్నారు.
ఇంటింటికి వెళ్లి పూర్తి వివరాలను కనుక్కుంటున్నారు. దీంతో కాబూల్ వాసులు భయంతో వణికిపోతున్నారు. ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతం మొత్తం తాలిబన్ల వశం అయింది. బయటకు మహిళలు రావడం లేదు వస్తే ప్రశ్నించి అడుగుతున్నారు ఇంటికి పరిమితం అయ్యారు ఈ నగరంలో మహిళలు.