ఓ టాయ్ లెట్ ఖరీదు ఎంతుంటుంది సాధారణంగా అయితే ఐదు లేదా పదివేలు …బాగా లగ్జరీ అయితే లక్ష ఉంటుంది.. బాగా ధనవంతులు బంగారం వజ్రాలతో చేయిస్తే 2 కోట్లు ఉంటుంది అని అనుకుంటాం. కాని ఏకంగా ఓ టాయిలెట్ ఖరీదు 170 కోట్లు వినడానికి ఆశ్చర్యం కలిగించవచ్చు కాని ఇది అక్షరసత్యం.
ఇది మామూలు టాయ్ లెట్ అయితే ఇంతగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇది భూమ్మీద నిర్మించేది కూడా కాదు. అంతరిక్షంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ కమ్మోడ్ తయారు చేసింది. దానికి అయిన ఖర్చు రూ. 170 కోట్లు.
ఇక స్పేస్ లో మన భూమిమీద ఉన్నట్లు వాతావరణం ఉండదు, మరి అక్కడ వాతావరణానికి తగిన రీతిలో మనం స్పేస్ సూట్స్ పరికరాలు తీసుకువెళతాం, అయితే అంతా మనుషులు అక్కడ గాలిలోనే తేలుతారు
. మరి అక్కడ వారికి టాయిలెట్స్ కి ఇబ్బంది లేకుండా దీనిని తయారు చేశారు.
దాదాపు 45 కిలోల బరువుండే ఈ టాయ్లెట్..పూర్తిగా టైటానియంతో తయారైంది. రీసైక్లింగ్ పంపే మునుపే ఈ టాయ్లెట్లోని మానవ వ్యర్థాలను యాసిడ్లను వినియోగించి.. ఓ ప్రత్యేక ప్రక్రియ ద్వారా దాన్ని నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. ఇది పురుషులు స్ట్రీలు ఇద్దరికి వాడేలా తయారు చేశారు.
మరి ఈ సరికొత్త కమ్మోడ్ అంతరిక్షంలో ఎలా పని చేస్తుందో పరిక్షించాలి అని చూస్తున్నారు. అప్పుడే ఇవి ఇంకా మరికొన్ని తయారు చేస్తారట.