రైల్వే స్టేషన్లో రైలు పట్టాలను దాటడానికి చాలా మంది ప్రయత్నిస్తారు.. ప్లాట్ ఫామ్ మారే సమయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై కాకుండా ఇలా పట్టాలపై వెళ్లడం వల్ల పలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కొందరు కోల్పోయారు, ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయి..తాజాగా ఇలాంటి ప్రమాదం జరిగింది, కాని అతని ప్రాణాలు మాత్రం కాపాడుకోగలిగాడు.
అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ . ముంబైలోని దహిసార్ రైల్వే స్టేషన్లో రైలు పట్టాలను దాటడానికి గన్పత్ సోలంకీ అనే ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే బూటు జారిపోయింది.. మళ్లీ దానిని తీసుకుని వేగంగా వచ్చాడు.
అప్పటికే వేగంగా వస్తున్న ట్రైన్ కాస్త స్లో అయింది..ఓ పోలీసు ఈ విషయాన్ని గుర్తించి అతడిని ప్లాట్ ఫాం మీదకు లాగాడు. అతను చేసిన పిచ్చ పనికి పోలీస్ చెడా మడా తిట్టేశాడు, ఇలా ఎవరైనా దాటతారా అని అందరూ విమర్శించారు…జస్ట్ సెకన్ల వ్యవధిలో అతను తప్పించుకున్నాడు.
ఈ వీడియో చూడండి
#WATCH | Maharashtra: A constable of Mumbai Police helped a 60-year-old man, who got stuck at a railway track, save his life at Dahisar railway station in Mumbai yesterday. pic.twitter.com/lqzJYf09Cj
— ANI (@ANI) January 2, 2021