ఎంగేజ్మెంట్, వెడ్డింగ్ రింగ్లు ఎవరి జీవితంలో అయినా చాలా ముఖ్యం.. అవి అస్సలు పోగొట్టుకోరు, జీవితాంతం ఈ రింగులు ఇద్దరూ ఎంతో భద్రంగా దాచుకుంటారు..కాని ప్రేమికుల రోజునే తన వెడ్డింగ్ రింగ్ పొగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. దీంతో అతడు చాలా బాధపడ్డాడు, అంతేకాదు భార్యకు చెబితే ఏమి అంటుందా అని టెన్షన్ పడ్డాడు, చివరకు ఈ ఉంగరం దొరికింది ఎలా అంటే.
బ్రిటన్కు చెందిన జేమ్స్ రాస్కు 2009లో లారాతో వివాహామైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయితే అతని చేతికి ఉన్న రింగ్ పెళ్లికి తన భార్య తొడిగింది, అయితే దాన్ని చేతికి ఎప్పుడూ పెట్టుకుంటాడు. అయితే వాలెంటైన్స్ డే రోజు తన ఇంటి ముందుకు వచ్చిన చెత్త బండిలో చెత్త వేశాడు.. ఈ సమయంలో చేతికి ఉన్న రింగ్ అందులో పడిపోయింది.
అతను చూడలేదు తర్వాత చూసుకున్నాడు తర్వాత ఆ చెత్త బండిలో పడి ఉంటుంది అని అనుమానించాడు..మున్సిపాలిటీ వాహనం వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న మహిళా పోలీసు అధికారినికి తన బాధ చెప్పుకున్నాడు… దీంతో వెంటనే నలుగురు సిబ్బంది ఆ రింగ్ కోసం వెతికారు… మొత్తానికి 20 నిమిషాలకు ఉంగరం దొరికింది, ఈ ఉంగరం అతడికి ఎందుకంత ప్రత్యేకమో కూడా వివరించాడు. ఆ ఉంగరంపై తన భార్య రాసిన అక్షరాలు ఉన్నాయని, అవి లేజర్ ద్వారా సెట్ చేసినట్లు చెప్పాడు. అందుకే ఆ రింగ్ తనకు అంత ప్రత్యేకం అని తెలిపాడు.