ఎక్కడైనా తండ్రి తన కొడుకు బాగా ఉండాలి అని కోరుకుంటాడు, అంతేకాదు కోడలు కొడుకు పిల్లలు బాగుంటే ఎంతో సంతోషిస్తాడు, కాని ఇక్కడ విచిత్రం అనే చెప్పాలి, తన కొడుక్కి ఈ తండ్రి వింత రూల్ పెట్టాడు, కొడుక్కి పెళ్లి చేశాడు, అంతా బాగానే ఉంది కాని వీరిద్దరూ పిల్లల్ని కనద్దు అని చెప్పాడు తండ్రి, దీంతో తండ్రిపై ఉన్న ప్రేమతో ఆ కొడుకు పిల్లలను కనకుండా దూరంగా ఉన్నాడు.
ఆ కోడలు మాత్రం మామతో కోపంతో ఉంది, అంతేకాదు కోర్టుకి కూడా వెళ్లింది.. ఏడు సంవత్సరాలు అయినా ఆ దంపతులు పిల్లలకు నోచుకోలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకుంది. అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. ఒకవేళ పిల్లలు పుడితే ఆస్తి దక్కకుండా చేస్తానని బెదిరించాడు.
కొడుకు పిల్లల్ని కంటే తన మీద ప్రేమ తగ్గిపోతుందని భయపడ్డాడట. కొడుకు తన మీద చూపించే ప్రేమ పిల్లలపై వైపు వెళుతుందని అనుకున్నాడు. ఈ విషయం విని ఇదేం గోలరా బాబు అంటూ అందరూ విమర్శలు చేస్తున్నారు.
ఆరునెలలు కౌన్సిలింగ్ నిర్వహించినా తన మామలో ఎలాంటి మార్పు రాలేదని ఆ మహిళ తెలిపింది.
అయితే ఆ తండ్రి మాత్రం కొత్త వాదన తెచ్చాడు..వాళ్లు తన మరణం తర్వాత పిల్లల్ని కనవచ్చని కూడా చెప్పాడు. ఒక వేళ తన కోడలికి పిల్లలు కావాలనుకుంటే.. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని కూడా చెప్పాడు.