ఆఫ్గనిస్తాన్ లో కరెన్సీ విలువ భారీగా పడిపోయింది

The value of the currency in Afghanistan has fallen sharply

0
102

ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ కరెన్సీ రేటు కూడా భారీగా పడిపోయింది. ఇక్కడ నుంచి ఆ దేశ అధ్యక్షుడు వెళ్లిపోయాడు. అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పారిపోవడంతో పెట్టుబడిదారులు కూడా ఆ దేశం నుంచి వెళ్లడానికి సిద్దం అవుతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ విలువ నేడు 4.6% పడిపోయి 86.0625కు చేరుకుంది. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్న రోజు నుంచి వరుసగా ఐద‌వ‌ రోజు కరెన్సీ విలువ తగ్గింది అని చెబుతున్నారు. ఇక పెట్టుబడులు పెట్టేవారు వ్యాపారాలు చేసేవారు ఏం చేయాలో అర్దం కాని పరిస్దితి. మరో వైపు ఎగుమతులు దిగుమతులు కూడా ఒక పది రోజుల నుంచి నిలిచిపోయాయి.

తాజాగా తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. తాలిబన్ల దూకుడుకు అమెరికా జో బైడెన్ సర్కార్ బ్రేకులు వేసింది. వారికి నిధులు దక్కకుండా మొత్తం ఆ నిధులని ఫ్రీజ్ చేసింది. అమెరికా బ్యాంకుల్లో ఉన్న ఆప్ఘన్ ఖాతాలు ప్రస్తుతం ఫ్రీజ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీజ్ చేసింది అకౌంట్లు.