ఆమె పేరు మోనల్ ప్రీతి ఆమె ఇంజనీరింగ్ చదివే సమయంలో మోహన్ కులకర్ణి అనే వ్యక్తిని ప్రేమించింది.. అయితే పెద్దలు మాత్రం ఈ ప్రేమని అంగీకరించలేదు, ఇక ఆమె దూరపు బంధువులు మోనల్ ప్రీతి అందంగా ఉండటంతో తన కుమారుడికి పెళ్లి చేయమని అడిగారు. ధనవంతులు కావడంతో ఆమె తండ్రి ఒప్పుకున్నాడు, ఇక మోనల్ ప్రీతి కి ఆ వ్యక్తిని ఇచ్చి వివాహం చేశారు.
అతను ప్లాస్టిక్ వస్తువుల కంపెనీనీ సూరత్ లో నడుపుతున్నాడు, కోట్ల రూపాయల ఆస్తి ఉంది. నెలకి 10 లక్షల వరకూ సంపాదన.. అంతా బాగానే ఉంది కానీ ప్రీతీ మాత్రం సంతోషంగా లేదు.. తన ప్రియుడిని మర్చిపోలేకపోతోంది.. 2018 జనవరిలో వీరి వివాహం అయింది, అయితే మార్చి నుంచి ప్రియుడు మోహన్ కులకర్ణితో ఫోన్ లో మాట్లాడేది.
తరచూ భర్త వ్యాపారం పనిమీద బయటకు వెళ్లిన సమయంలో, అతను కూడా సూరత్ వెళ్లేవాడు వీరిద్దరూ రూమ్ తీసుకుని ఏకాంతంగా గడిపేవారు.. ఇలా భర్త తెచ్చిన నగదుని నెల నెలా రెండు మూడు లక్షలు తప్పించింది. సుమారు 50 లక్ష ల రూపాయల వరకూ ప్రియుడికి ఇచ్చింది.
అతని చేత ఓ కంప్యూటర్ స్పేర్ పారట్స్ షాప్ పెట్టిందిచింది, అయితే నగదు మిస్ అవ్వడంతో ఏదో కబుర్లు చెప్పేది భర్తకి. ఓరోజు ఆమె బ్యాంకు ఖాతా చూస్తే 6 లక్షలు మోహన్ అకౌంట్ కు పంపింది…భర్త అనుమానంతో తీగ లాగితే ఆమె నేరుగా బ్యాంకుకు వెళ్లి అతని అకౌంట్లో జమ చేస్తోంది అని తెలుసుకున్నాడు… దీంతో ఆమె బండారం బయటపెట్టి డిసెంబర్ 7న విడాకుల ఇచ్చాడు. లాక్ డౌన్ వేళ అతనికి ఏకంగా 35 లక్షల నగదు పంపిందట.