సినిమాల్లోనే ఇలా భర్తని భార్య ప్రియురాలికి అమ్మిన సంఘటనలు చూశాం… అసలు నిజ జీవితంలో ఇలా జరుగుతుందా అని అనుకుంటాం… కాని ఇప్పుడు దేశంలో ఇలా జరిగింది, భోపాల్ లోని ఓ భార్య తన భర్తని ప్రియురాలికి అమ్మేసింది, తన భర్త పని చేస్తున్న ఆఫీసులో మరో మహిళతో చనువుగా ఉంటున్నాడు… అక్కడ ఆమె ప్రేమలో ఉండి తన భార్యతో గొడవపడుతున్నాడు. దీంతో ఇంట్లో భార్య భర్తలకు గొడవులు జరిగేవి.
తల్లిదండ్రుల గొడవలు తట్టుకోలేక అతని ఇద్దరు కూతుర్లు కోర్టుకి తెలిపారు, దీనిపై ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు, అయినా మార్పు లేదు… వారు విడిపోవాలి అని అనుకున్నారు… అయితే తన కూతుర్ల భవిష్యత్తు ఆలోచించి ఆమె వారికి సాయం చేయాలి అని కోరింది… దీంతో కోటిన్నర విలువైన ఇంటిని అలాగే 27 లక్షల రూపాయల నగదుని అతని భార్యకి ఇచ్చి ప్రియుడ్ని సొంతం చేసుకుంది ప్రియురాలు..
ఇక ఆమె భర్తకి విడాకులు ఇచ్చేసింది.. ఈ ఆస్తి ఆమె కూతుర్ల వివాహానిక చదువులకి ఉపయోగించుకోనున్నారు, మొత్తానికి భర్త ఇక తనకు దూరం అయ్యాడు అని అందుకే తన పిల్లల భవిష్యత్తు కోసం వీటిని తీసుకున్నాను అని ఆమె తెలిపింది.