నేటి ఆధునిక ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది.. అయినా కొంత మంది దెయ్యాలు భూతాలు ఇలాంటి మూఢనమ్మకాలతో ఉంటున్నారు, ఇంకా క్షుద్రపూజలు చేతబడి అని నమ్ముతూ కాలం వృథా చేసుకుంటున్నారు.
మనిషి కష్టపడి సాధించలేనిది ఏదీ లేదు. దానిని పక్కన పెట్టి ఇలాంటి టైమ్ వేస్ట్ వ్యవహారాల్లో ఉంటున్నారు,ఇటీవల మధనపల్లె ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం అయింది.
అయితే తాజాగా ఇలాంటిది మరో ఘటన జరిగేది కాని పోలీసులు వెంటనే వారిని ఆపారు..యూపీలోని మఢా గ్రామంలో 52 ఏళ్ల మహిళ తన ఇంటి వెలుపల త్రిశూలం చేతపట్టి సజీవ సమాధి అయ్యింది. ..ఈ సమయంలో గ్రామస్తులు పాటలు పాడుతూ భజనలు చేశారు, వెంటనే ఈ విషయం పోలీసులకి తెలిసింది. వెంటనే వారు వచ్చి సమాధిలో ఉన్న ఆమెని బయటకు తీశారు.
ఆ మహిళకు కలలో మహాశివుడు కనిపిస్తాడని ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు, ఆమె సమీపంలో ఉన్న శివాలయంలో పూజలు చేస్తు ఉంటుందట.. ఇలా ఆ శివుడు తనకు కనిపిస్తాడు అని చెబుతోంది..48 గంటల పాటు సజీవ సమాధి చేసుకోబోతున్నట్లు తెలిపింది ఇంటిలో వారికి . చివరకు ఇంటి దగ్గర ఆమె సమాధి ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు.. ఆమెని సమాధిలో ఉంచారు…కాని ఐదు గంటలు ఆమె అందులో ఉండిపోయింది.. చివరకు పోలీసులు ఆమెని బయటకు తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించారు.