ఉదయం నుంచి రాత్రి వరకూ ఏటీఎంలు చాలా చోట్ల రష్ గా ఉంటాయి, నగదు తీసుకునే వారు చాలా మంది వస్తూ ఉంటారు, ఇక మెయిన్ సెంటర్ లో ఉంటే రాత్రి 2 గంటల వరకూ కూడా బిజీగానే ఉంటాయి, అయితే తెల్లవారు జామున మాత్రం ఖాళీగానే ఉంటాయి, పెద్ద జనం ఎవరూ రారు కాబట్టి ఖాళీగానే కనిపిస్తాయి ఏటీఎం సెంటర్లు, అయితే ఇదే సమయంలో కొందరు వీటిని దొంగిలిస్తున్నారు.
మహారాష్ట్రలోని ఫల్ఘర్ జిల్లాలో వాసయ్ నగరంలోని వాలివ్ ప్రాంతంలో తెల్లవారుజామున 3గంటల సమయంలో ఓ 26 ఏళ్ల యువతి నడుస్తూ వస్తోంది. ఈ సమయంలో అక్కడ ఏటీఎం సెంటర్ లో ఓ వ్యక్తి ఉన్నాడు.. అతని పద్దతి చూసి ఆమెకి అనుమానం వచ్చింది.. అతను దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.. అతను దొంగ అని భావించింది.
వెంటనే అటుగా వెళ్లి ఏటీఎం షట్టర్ క్లోజ్ చేసింది..ఇక అతను లోపల ఉండిపోయాడు.. వెంటనే ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు… చివరకు అతన్ని అరెస్ట్ చేశారు..ఆ యువతి చూపిన తెగువకు పోలీసులు, స్థానికులు ఫిదా అయ్యారు… అందరూ ఆమెని ప్రశంసిస్తున్నారు, ఇక ఆమె దైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ReplyForward
|