నెల పాటు థియేటర్లు బంద్….

నెల పాటు థియేటర్లు బంద్....

0
96

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది… చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ పలు దేశాలకు వ్యాప్తి చెందింది.. ఈ వైరస్ రోజు రోజు విస్తరిస్తున్ననేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్త మవుతున్నాయి.. ఈ క్రమంలోనే ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి..

స్కూళ్లు కాలేజీలు షాపింగ్ మాల్స్, పబ్ లను నెల పాటు మూసివేయాలిన ఆదేసిందించి ఇప్పటికే కర్నాటక గుజరాత్ సిక్కీం ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు వాటికి సెలవులు ప్రకటించాయి..

అయితే ఇప్పటివరకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది… ఈ వైరస్ విస్తరించకుండా ఉండేందుకు ఇరు తెలుగు రాష్ట్రాలు అప్ర మత్తమయ్యాయి.. టాలీవుడ్ పెద్దలు కూడా కరోనా వైరస్ నేపథ్యంలో అప్రమత్తమయ్యారు.. థీయేటర్లు మూసివేత వంటి వాటిపై చర్చించుకుంటున్నారు.. దీంతో చాలా సినిమాల విడుదలకు వాయిదా పడే అవకాశం ఉంది…