ఈ వైరస్ లాక్ డౌన్ వేళ , దేశ వ్యాప్తంగా 52 రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉంది… దీంతో దేవాలయాలు కూడా ఎక్కడా తెరవడం లేదు. భక్తులకి దర్శనం లేదు, తిరుమలలో కూడా స్వామి దర్శనం 50 రోజులుగా భక్తులకి లేదు, అయితే తాజాగా శ్రీవారి దేవాలయం దగ్గర భక్తులకి లడ్డూ ప్రసాదాలు విక్రయాలు చేస్తున్నారు.
ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని ప్రధాన పరిపాలన భవనం వద్ద వీటిని అమ్ముతున్నారు.దీంతో ఈ వార్త తెలియగానే పెద్ద ఎత్తున భక్తులు అక్కడకు చేరుకున్నారు, స్వామి ప్రసాదం తీసుకునేందుకు క్యూ కట్టారు.
స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు. సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో త్వరలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు యోచిస్తున్నారు, త్వరలో దీనిపై ప్రకటన రానుంది, ఆన్ లైన్ టికెట్ల ద్వారా సమయం కేటాయిస్తారు, ముందు తిరుమల తిరుపతి వారికి ఉద్యోగులకు దర్శనం కల్పిస్తారు.