మనం రోడ్లపై వెళ్లే సమయంలో ఒక్కోసారి ఈ భారీ హారన్లు తెగ చికాకు పెడుతూ ఉంటాయి. ఇక రోడ్లకు బాగా దగ్గరగా ఇళ్లు ఉంటే నిత్యం ఈ హారన్ల మోత ఉంటూనే ఉంటుంది. ఇలా వాహనాల హారన్ల శబ్దాలు చాలా చికాకు కలిగిస్తాయి. ఇంకా కొందరు ఆశ్చర్యకరంగా కొన్ని నిషేధిత ప్రాంతాల్లో కూడా హారన్లు కొడుతూనే ఉంటారు. శబ్ద కాలుష్యాన్ని పెంచుతుంటారు. తాజాగా ఇలాంటి వాటికి అడ్డుకట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.
వాహనాల హారన్ల శబ్దానికి సంబంధించి కొత్త నిబంధనలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
కార్ హారన్ల శబ్దాన్ని మార్చే పనిలో ఉందట కేంద్రం. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ హారన్ సౌండ్ ప్లే స్ లో ఇక వేణువు లేదా వయోలిన్ వినిపిస్తే భలే ఉంటుంది కదా .భారతీయ సంగీత వాయిద్యాల శ్రావ్యమైన శబ్దం వినబడనుంది.
కొత్తగా వినిపిస్తున్న వార్తల ప్రకారం హారన్ గా తబలా, తాల్, వయోలిన్, బుగ్లే, ఫ్లూట్ వంటి వాయిద్యాల శబ్దం వినిపించవచ్చట. ఇలా అయితే ఎలాంటి శబ్ద కాలుష్యం ఉండదు. పెద్ద పెద్ద వాహనాలకు మాత్రం ఇలా హారన్ ఉండే అవకాశం ఉంది.