నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుంది, అందుకే నరదిష్టి తగలకుండా చూసుకోవాలి, అంతేకాదు పిల్లల విషయంలో కూడా వారానికి ఓసారి అయినా దిష్టి తీయాలి , ఇలా చేయడం వల్ల వారిపై ఉన్ననెగిటివిటీ మొత్తం పోతుంది.
ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు.. వాళ్లకి తలనొప్పి రావడం, వికారపెట్టడం, వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే దిష్టి తీసిన సమయంలో ఇలాంటి చెడు దృష్టి దోషం పోతుంది.
మరి వీటికి ఏం చేస్తే మంచిది అంటే పండితులు కొన్ని చెబుతున్నారు
ఎండు మిరపకాయలు,
రాళ్ల ఉప్పు,
నల్ల తాడు,
నిమ్మకాయలతో దిష్టి తీయడం
పసుపు, సున్నం కలిపిన నీళ్లతో దిష్టి తీయడం
గుమ్మడికాయ,
చంటి బిడ్డ నుదిటిపై బుగ్గపై నల్లటి చుక్క
వీటి వల్ల చెడు దృష్టి తగలదు దిష్టి తీయడం మంచిది.