ఏపీలో సంక్షేమ పథకాల అమలులో వైయస్ జగన్ దూసుకుపోతున్నారు.. అంతేకాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తోంది సర్కార్, నవరత్నాలను కూడా నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది, తాజాగా మరో కీలక అడుగు వేశారు సీఎం జగన్.
ఏపీలో ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించింది. మరి ఈ పథకం ద్వారా ఏం లాభం అనేది చూద్దాం, ముఖ్యంగావైట్ రేషన్ కార్డ్ ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.. బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరనుంది. ..ఈ బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఏపీలో మొత్తం 1.41 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది.
మీకు వైట్ రేషన్ కార్డ్ ఉంటే, 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది.
18 – 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న లబ్ధిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు చొప్పున బీమా పరిహారం చెల్లిస్తారు. పూర్తి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది.
అంతేకాదు 51 – 70 ఏళ్ల మధ్య వయసు లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.3 లక్షలు పరిహారం లభిస్తుంది. శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.3 లక్షలు బీమా పరిహారం అందుతుంది.