ఇకరైల్వే టికెట్లు అమెజాన్ ఇండియాలో కూడా బుక్ చేసుకోవచ్చు, ప్రైమ్ అమెజాన్ కస్టమర్లకు ఇది శుభవార్త అనే చెప్పాలి…రైలు టికెట్లను బుక్ చేసుకొనే సౌకర్యాన్ని అమెజాన్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ఇండియా, భారత్ రైల్వేకు చెందిన ఐఆర్సీటీసీలు ఒప్పందం చేసుకొన్నాయి.
ఇక మీరు మొదటిసారి అమెజాన్ ద్వారా టికెట్ చేసుకుంటే మీకు 10 శాతం క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.
అత్యధికగా రూ.100 వరకు ఉంటుంది. ఇక ప్రైమ్ సభ్యులకు 12శాతం క్యాష్బ్యాక్ వస్తుంది. ఇది అత్యధికంగా రూ.120 వరకు ఉంటుంది. అయితే ఇది కొంత కాలం మాత్రమే ఆఫర్ వాలీడ్ ఉంటుంది.
ఈ కొత్త సేవలతో అమెజాన్ పేతో విమాన, బస్సు టికెట్లతోపాటు రైలు సీట్లు కూడా బుకింగ్ చేసుకొనే అవకాశం లభించింది. ఇక మీరు ట్రైన్ చెక్ చేసుకోవచ్చు, పీఎన్ ఆర్ చెకింగ్, టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు కస్టమర్ల కోసం 24×7 హెల్ప్లైన్ అమెజాన్ ఏర్పాటు చేసింది.