బంగారం ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా పెరుగుతోంది, కాని మన దేశంలో మాత్రం బంగారం ధర సాధారణంగానే ఉంది. కొనుగోలు దారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. రెండు రోజులుగా బంగారం ధర స్ధిరంగా ఉంది. వెండి ధర నిన్న కాస్త తగ్గుముఖం పట్టింది.. మరి నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి ముంబై బులియన్ మార్కెట్లో అమ్మకాల జోరు బారీగా పెరిగింది. బంగారం వెండ ధరలు ఓసారి చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర స్థిరంగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,830
దగ్గర ఉంది, ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో ట్రేడ్ అవుతోంది. రూ.42,010 దగ్గర స్థిరంగా కొనసాగుతోంది. దాదాపు ఇది మూడవ రోజు మూడు రోజులుగా బంగారం ధర సాధారణంగా ఉంది ఎలాంటి మార్పులు లేవు బంగారం ధరలో.
బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి రేటు కూడా చూద్దాం.. వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. రేటు రూ.71,600 కి ట్రేడ్ అవుతోంది.. వెండి ఈరోజు వంద రూపాయలు మాత్రమే తగ్గింది కిలోకి, ఇక వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.