జనవరి 2021 వచ్చేసింది కొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇచ్చాం, అయితే కొన్ని వస్తువులు ఈ ఏడాది ధరలు బాగా పెరగనున్నాయట, ముఖ్యంగా కొన్ని వస్తువులు భారీగా పెరిగితే మరికొన్ని స్వల్పంగా పెరగనున్నాయి..మరి ఈ 2021లో ఏఏ వస్తువులు ఎంత ధర పెరుగుతాయి అనేది చూద్దాం.
ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ ఈ వస్తువులు సుమారు 10 శాతం ధరలు పెరుగుతాయి,
వీటి తయారికి కావాలసిన ముడిపదార్థాలైన కాపర్, అల్యూమినియం, స్టీల్, ప్లాస్టిక్ ధరలు భారీగా పెరిగాయి దీంతో ఈ వస్తువుల ధరలు పెరగనున్నాయి.
అంతేకాదు నౌకా రవాణా, విమానాల్లో కార్గో ధరల్లో పెరుగుదల ప్రభావం కూడా వీటిపై పడనుంది. ఇక ముఖ్యంగా టీవీల ధరలు పెరుగుతాయి, ఎందుకు అంటే ప్యానల్ ధరలు పెరుగుతున్నాయి, సుమారు టీవీలు 12 నుంచి 15 శాతం ధరలు పెరుగుతాయి.
ఇక మీరు కొనే ప్లాస్టిక్ వస్తువులు కూడా నూటికి 8 శాతం పెరగనున్నాయి, భారీగా పెరిగిన తయారీ ఖర్చులు రవాణాలు కూడా దీనికి కారణం.