వరల్డ్‌లోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్స్ ఇవే..భారత్ స్థానం ఎన్నంటే?

0
93

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితా విడుద‌లైంది. ఈ ఏడాది 2022కి సంబంధించి బ్లూమ్ బెర్గ్ ఈ జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితా ప్రకారం..సింగపూర్, సౌత్ కొరియాను వెనక్కి నెట్టి మరీ జపాన్ మొదటి ర్యాంకులో నిలిచింది.

ఆ తరువాత స్థానంలో సింగ‌పూర్, ద‌క్షిణ కొరియా ఉన్నాయి. అయితే ఆఫ్గ‌నిస్తాన్ పాస్ పోర్ట్ త‌క్కువ ఉప‌యోగ‌క‌రంగా ఉంద‌ని ఈ జాబితా తేల్చింది. 80 దేశాల‌కు యాక్సెస్ తో చైనా 69వ స్థానంలో నిలవగా..నిత్యం జ‌నంతో ర‌ద్దీగా ఉండే భార‌తదేశం విచిత్రంగా 87వ స్థానంతో స‌రి పెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఆ దేశానికి చెందిన పాస్ పోర్ట్ తో 193 దేశాల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌యాణం చేసేందుకు వీలు క‌ల్పిస్తోంది.

అలాగే సింగ‌పూర్ , ద‌క్షిణ కొరియా దేశాల కంటే జ‌పాన్ పాస్ పోర్ట్ తో ఈజీగా ఎక్క‌డికైనా ప్ర‌యాణం చేసేందుకు వీలు క‌లుగుతుంద‌ట‌. ర‌ష్య‌న్ జారీ చేసే పాస్ పోర్ట్ 50వ స్థానంలో నిలిచింది. ఇది 119 దేశాల‌కు సుల‌భంగా వెళ్లేందుకు దోహ‌ద ప‌డుతోంది. ప్రపంచంలో అత్య‌ధికంగా ఆమోదించబ‌డ‌ని 10 పాస్ పోర్ట్ ల‌లో ఆసియా దేశాలు క‌నిపించ లేదు. యుకె 187 దేశాలకు యాక్సెస్ తో ఆరో స్థానంలో నిలిచింది. ఇక అమెరికా 186 స్కోర్ తో ఏడో స్థానంలో ఉంది.

టాప్ 10 పాస్ పోర్ట్స్ ఇవే..

జపాన్ (193 గమ్యస్థానాలు)

సింగపూర్, సౌత్ కొరియా (192)

జర్మనీ, స్పెయిన్(190)

ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్ (189)

ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్ (188)

ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, యూకే (187)

బెల్జీయం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, అమెరికా (186)

ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా (185)

హంగేరీ (183)

పోలాండ్, లిథువేనియా, స్లోవేకియా (182)