గ్రూప్‌ వన్ నోటిఫికేషన్ విడుదల చేసే పోస్టులు ఇవే..

0
239

తెలంగాణలోని నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30,453 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అనుమ‌తి ఇచ్చింది. ఈ మేరకు శాఖల వారిగా పోస్టులను వెల్లడించింది.

గ్రూప్‌ వన్ నోటిఫికేషన్ విడుదల చేసే పోస్టులు ఇవే..

503 గ్రూప్‌వన్‌ పోస్టుల్లో 42 డిప్యూటీ కలెక్టర్, 91 డీఎస్పీ, 121 ఎంపీడీఓ పోస్టులున్నాయి. బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు ఐదు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 40, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు 38, మున్సిపల్ కమిషనర్ రెండో గ్రేడ్ పోస్టులు 35 ఉన్నాయి. 48 వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు 26, జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఐదు ఉన్నాయి.